ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్

అక్క‌లు ల‌క్ష్మీబాయి, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ‌, చెల్లెలు వినోద‌మ్మ కేసీఆర్‌ కు రాఖీలు క‌ట్టారు. అనంత‌రం సోదరీమణులకు కేసీఆర్ పాదాభివంద‌నం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement
Update:2023-08-31 17:08 IST

తెలంగాణ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ కు ఆయన తోబుట్టువులు రాఖీలు క‌ట్టారు. కేసీఆర్ అక్క‌లు ల‌క్ష్మీబాయి, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ‌, చెల్లెలు వినోద‌మ్మ కేసీఆర్‌ కు రాఖీలు క‌ట్టి ఆశీర్వ‌దించారు. అనంత‌రం అక్కలకు కేసీఆర్ పాదాభివంద‌నం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


మంత్రి హరీష్ రావు ఇంట్లో కూడా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. హరీష్ రావు బంధువులు, ఆయనను సోదరుడిగా భావించి అభిమానించే పార్టీ మహిళా నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.



మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉండటంతో ఈ ఏడాది ఆయనను నేరుగా కలసి రాఖీ కట్టలేకపోయారు ఎమ్మెల్సీ కవిత. కేటీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆమె ట్వీట్ వేశారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం మా అన్న అంటూ కేటీఆర్ తో కలసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.


కవిత ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు రాఖీ పండగ జరుపుకున్నాకు. పిల్లలు, పెద్దలు రాఖీలతో సందడి చేశారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కి రాఖీ కట్టారు కవిత.


మంత్రులు తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి కూడా తమ నివాసాల్లో జరిగిన రాఖీ పండగ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. 



Tags:    
Advertisement

Similar News