రేపు తెలంగాణలో రాహుల్ యాత్ర ముగింపు.. భారీ బహిరంగ సభ

తెలంగాణలో జోడో యాత్ర ముంగింపు సభలో మునుగోడు ఫలితాలపై రాహుల్ స్పందించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కి విజయావకాశాలు లేకపోయినా, కనీసం రెండో స్థానం సాధిస్తే మాత్రం బీజేపీని వెనక్కు నెట్టామన్న సంతృప్తి ఉంటుంది.

Advertisement
Update:2022-11-06 08:52 IST


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో రేపటితో ముగుస్తుంది. యాత్ర ముగింపు సందర్భంగా మెనూరులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం నుంచి అద్భుత స్పందన వచ్చిందని చెబుతున్న నేతలు, యాత్ర ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున రాహుల్ కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.

మునుగోడు ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారు..?

మరికొన్ని గంటల్లో మునుగోడు ఫలితం రాబోతోంది. దాదాపుగా సర్వేలన్నీ టీఆర్ఎస్ కే ఏకపక్షంగా మద్దతు తెలిపాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణలో జోడో యాత్ర ముంగింపు సభలో మునుగోడు ఫలితాలపై రాహుల్ స్పందించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కి విజయావకాశాలు లేకపోయినా, కనీసం రెండో స్థానం సాధిస్తే మాత్రం బీజేపీని వెనక్కు నెట్టామన్న సంతృప్తి ఉంటుంది. మునుగోడులో మరీ దారుణ ఫలితాలు వస్తే మాత్రం రేపు రాహుల్ గాంధీ సభ చప్పగా సాగే అవకాశాలున్నాయి.

అక్టోబర్ 23న కర్నాటక నుంచి తెలంగాణలోని మక్తల్‌ లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టింది. మధ్యలో విరామం ఇచ్చినా 27నుంచి ఈ యాత్ర నాన్ స్టాప్ గా సాగింది. పాదయాత్రలో తెలంగాణ ఉద్యమకారులు, సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ యాత్రలో పిల్లలతో కలసి రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారు రాహుల్, క్రికెట్ ఆడారు, పోతరాజులా విన్యాసాలు చేశారు. మొత్తమ్మీద తెలంగాణలో రాహుల్ యాత్ర సందడిగా సాగింది. ముగింపు వేడుక కూడా అంతకంటే సందడిగా చేయాలనుకుంటున్నారు టీపీసీసీ నేతలు. నవంబర్ 7 తో తెలంగాణలో ముగుస్తున్న యాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది.

Tags:    
Advertisement

Similar News