ప్ర‌ధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న వాయిదా

ఈ నెల 19న ప్ర‌ధాని మోదీ ముంబ‌యికి వెళుతున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ను వచ్చే నెల‌లో ఏర్పాటు చేసే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌, రాష్ట్ర పార్టీలో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌ని ఆ పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Update:2023-01-11 12:00 IST

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈ నెల 19న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ రావ‌ల‌సి ఉండ‌గా బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్టు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్లే వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించ‌డంతో పాటు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని చేప‌డ‌తార‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌గా, చివ‌రి నిమిషంలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై త్వ‌ర‌లో కొత్త షెడ్యూల్ ఖ‌రారు కానుంది.

ఈ నెల 19న ప్ర‌ధాని మోదీ ముంబ‌యికి వెళుతున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ను వచ్చే నెల‌లో ఏర్పాటు చేసే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌, రాష్ట్ర పార్టీలో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌ని ఆ పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్ర పార్టీ నుంచి కొంత‌మందిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశ‌ముంద‌నే చ‌ర్చ కూడా పార్టీలో జ‌రుగుతోంది. దానికి సంబంధించిన మార్పుచేర్పుల కోస‌మే ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిందా అనే కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికార వ‌ర్గాలు మాత్రం ప్ర‌ధాని బిజీ షెడ్యూలు వ‌ల్లే హైద‌రాబాద్ రాలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు. ఆరోజు ముంబ‌యి వెళుతున్న ప్ర‌ధాని.. బిజీ షెడ్యూలు వ‌ల్ల హైద‌రాబాద్ టూర్ ర‌ద్ద‌యింద‌ని పేర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News