మరోసారి పెద్దపులి దాడి
మోర్లె లక్ష్మి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే మరో వ్యక్తిపై పులి దాడి.. తీవ్రంగా గాయపడిన రైతు సురేశ్
కుమురం భీం జిల్లాలో పులి దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరకముందే మరో వ్యక్తిపై దాడి చోటుచేసుకున్నది. పొలంలో పనిచేస్తున్న రైతుపై పులి దాడి చేసింది. స్థానికుల కేకలతో అది పారిపోయింది. సిర్పూర్. టి మండలం దుబ్బగూడలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు సురేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. పులి వరుస దాడులతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
శుక్రవారం కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి నజ్రుల్‌నగర్ గ్రామశివారులోని చేనులోకి పత్తి ఏరడానికి వెళ్లగా పులి దాడి చేసి నోటకరచుకని వెళ్లింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుస ఘటనల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తయ్యారు. పులి జాడ కోసం చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.