ఆకాశంలో మెట్రోరైల్... నోరూరిస్తున్న వంటకాలు
పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు సందర్శకుల నుంచి విశేష స్పందన
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు సందర్శకులు పోటెత్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ గాలిపటాన్ని ఎగురవేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మెట్రో నిర్వహిస్తున్న 'ఇట్స్ మీ టైమ్ ఆన్ మై మెట్రో థీమ్'లో భాగంగా మెట్రో నమూనాలో ఉన్న కైట్‌ను ఎగురవేశారు. ఈ గాలిపటాన్ని మెట్రో అధికారులు ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. మెట్రో గాలిపటం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
మొత్తం 50 దేశాలకు చెందిన సుమారు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. నగరవాసులు, పర్యాటకులు, విదేశీయులు హాజరై సందడి చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ఆహార ప్రియుల కోసం 1200 స్టాల్స్ ఏర్పాటు చేశారు.వివిధ రకాల వంటకాలు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. సందర్శకుల కోసం వందకు పైగా చేనేత హస్తకళ స్టాళ్లు ఏర్పాటు చేశారు. పర్యాటకులను అలరించడానికి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న ప్రారంభమైన పండుగ నేటితో ముగియనున్నది..