ఏడాది కిందట ఇదేరోజు రైతు 'మార్పు' కోసం ఓటేశాడు

ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్‌ ఎక్స్‌లో పోస్ట్‌

Advertisement
Update:2024-11-30 11:40 IST

సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. నేడు రైతు పండగ ముగింపు సభ కోసం మహబూబ్‌నగర్‌ రానున్నట్లు చెప్పారు. 'ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి 'మార్పు' కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌.. రూ. 10,444 కోట్ల ఉచిత విద్యుత్, రూ. 1,433 కోట్ల రైతు బీమా, రూ. 95 కోట్ల పంట నష్టపరిహారం, రూ. 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు.. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నంబర్‌ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా' అని సీఎం రేవంత్‌ రాసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News