రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పని చేస్తున్నదా?
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం స్పందించరా? అని నిలదీసిన బీజేపీ నేతలు
Advertisement
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీజేపీ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో నిజాం పరిపాలన జరుగుతున్నది. హిందూ దేవాలయాపలై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ధార్మిక సంఘాల నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎత్తివేసేలా చూడాలని కోరారు. తెలంగాణలో అసలు నిఘా వ్యవస్థ పనిచేస్తున్నదా అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం స్పందించరా? అని నిలదీశారు.
Advertisement