యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

దసరా సెలవులకు తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో ఆలయానికి భారీగా భక్తుల రాక;

Advertisement
Update:2024-10-06 19:35 IST
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • whatsapp icon

పిల్లలకు దసరా సెలవులకు తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి నిత్యకల్యాణం నిర్వహించే సమయానికి మెట్ల దారిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఎక్కువసేపు క్యూలైన్‌లలో నిలుచోవాల్సి వచ్చింది. ఫ్రీ దర్శనానికి కూడా సుమారు రెండు గంటలు, స్పెషల్‌ దర్శనానికి గంట టైం పడుతున్నది. ప్రసాద విక్రయశాల, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్‌, బస్టాండ్‌లో రద్దీ భారీగా ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News