మహిళలను ముందు పెట్టుకుని రేవంత్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారు : తుల ఉమ

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎందుకు మాట్లాడలేదని తుల ఉమ నిలదీశారు.

Advertisement
Update:2024-10-02 17:52 IST

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఖండించారు. ఏమి పని లేకనే కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేశారని ఉమ అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో వుంటే మహిళలకు బతుకమ్మ చీరలు పంచేవాళ్ళమని ఆమె తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎందుకు మాట్లాడలేదని తుల ఉమ నిలదీశారు. కొండా సురేఖపై ట్రోల్ జరిగితే హరీష్ రావు ఖండించారని.. ట్రోల్ అయిన వీడియోని కొండా సురేఖ మీడియా ముందు పెట్టారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా ట్రోల్స్ చేశారని ఆమె పేర్కొన్నారు.

అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీలో అంటే మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. హైడ్రా నుండి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సినిమా పరిశ్రమను కించపరిచే విధంగా కొండా సురేఖ మాట్లాడారని టాలీవుడ్‌లో ఉన్న మహిళలను కేటీఆర్ కు అంటగడతారా ప్రశ్నించారు. కొండా సురేఖ నోటి దురుసు గురించి అందరికి తెలుసు..కొండా సురేఖ ఇట్లాగే మాట్లాడితే కోర్టుకు ఈడుస్తామని తుల ఉమ హెచ్చారించారు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదని మహిళలకు నెలకు2,500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వలేదు,పింఛన్లు పెంచలేదని తెలిపారు.మహిళా మంత్రులను శికండిలాగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు.

మంత్రి సురేఖను అందరూ అసహాయించుకుంటున్నారని. తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో కొండా సురేఖ ఏం మాట్లాడారో అందరికి తెలుసని తుల ఉమ అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ట మహిళగా సిగ్గుపడుతున్నాని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. నాగార్జున,సమంతను ఎన్ని సార్లు రోడ్డుకు ఈడుస్తారని రాష్ట్ర మంత్రిగా వున్నా అనే స్థాయిని మర్చిపోయి కొండా సురేఖ మాట్లాడుతున్నారని కవిత తెలిపారు. మీ నోళ్ళను యాసిడ్ తో శుభ్రం చేయాలి కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎంపీ హెచ్చారించారు .కొండా సురేఖపై పరువునష్టం దావావేస్తామని కవిత తెలిపారు.

Tags:    
Advertisement

Similar News