బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే : హరీశ్‌రావు

రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన వల్ల హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పరిస్థితికి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో హైడ్రా భాదితులతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.

Advertisement
Update:2024-09-28 12:21 IST

సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన వల్ల హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పరిస్థితికి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో హైడ్రా భాదితులతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో హైడ్రా హైడ్రోజన్ బాంబులా తయారైందని ఆయన అన్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకున్న పేదరాలు బుచ్చమ్మ ఇళ్లు కూల్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు చేస్తామన్న అంశపై రేవంత్‌రెడ్డి దృష్టి పేడితే బాగుంటుందని హితువు పలికారు. మరోవైపు తెలంగాణలో ప్రజలంతా వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నా పట్టించుకున్న పాపాన పోవట్లేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పానలో ప్రజలను తాము ఏనాడు ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. అఖిలపక్షాలతో మాట్లాడిన తరువాతే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్‌ రాజ్ నహి చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడని, మరి తెలంగాణలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. నేడు తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్నారు. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తరువాత బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ఇక్కడ ప్రచారం చేయాలన్నారు.హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయన్నారు. ఎప్పుడైనా రావచ్చని, తాము మీ వెంటే ఉంటామని భరోసానిచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామని చెప్పారు. బీఆర్‌ఎస్ లీగల్‌ సెల్‌ బాధితులకు అండగా ఉంటుందని హరీశ్‌రావు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News