బాలికల విద్యకు మరింత భరోసా.. తెలంగాణలో కొత్త కేజీబీవీలు

రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మంజూరయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ జీవో 24ను విడుదల చేసింది. వీటి నిర్వహణకు రికరింగ్‌ బడ్జెట్‌ గా రూ.60 లక్షలు మంజూరు చేసింది.

Advertisement
Update:2023-08-30 06:42 IST

తొమ్మిదేళ్ల నవతెలంగాణ అన్ని రంగాల్లో ముందు నిలవడానికి కారణం అప్పటికే ఏర్పాటు చేసిన వసతులు కాదు, రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటున్న సౌకర్యాలే దానికి కారణం. విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో సరైన పునాది వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాని ఫలితాలే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి బాలికల విద్య కోసం ఈ ప్రాంతంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు కేవలం 391. ఇప్పుడవి 495కి చేరుకున్నాయి. విద్యారంగంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చదువుకోడానికి వారికి ఉన్న అవకాశాలను మరింత విస్తృతపరుస్తోంది.

కొత్తగా 20 కేజీబీవీలు..

రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మంజూరయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ జీవో 24ను విడుదల చేసింది. వీటి నిర్వహణకు రికరింగ్‌ బడ్జెట్‌ గా రూ.60 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో 391 కేజీబీవీలు ఉండేవి. 2017-18లో మరో 84 కొత్త విద్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా 20 కేజీబీవీలు ఏర్పాటు చేయగా, వాటి సంఖ్య 495కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 230 కేజీవీబీల్లో పదో తరగతి వరకు అందుబాటులో ఉంది. 245 కేజీబీవీల్లో ఇంటర్‌ వరకు చదువుకునే వెసులుబాటు ఉంది.

గురుకులాల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చొరవ పేద విద్యార్థులకు ఎంతగానే ఉపయోగపడుతోంది. ప్రత్యేకించి గిరిజన గురుకులాలు తెలంగాణ ఏర్పాటయిన తర్వాత రెట్టింపయ్యాయి. బాలికలకు సంబంధించి కేజీబీవీలు 100కు పైగా పెరిగాయి. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, హాస్టళ్లలో రద్దీ లేకుండా సమీకృత విద్యాలయాల సంఖ్యను పెంచుతోంది తెలంగాణ ప్రభుత్వం. 


Tags:    
Advertisement

Similar News