పొన్నాల బాటలో నాగం.. ఇక్కడ కూడా కేటీఆరే కీలకం

గతంలో పొన్నాల విషయంలో కూడా మంత్రి కేటీఆర్ భేటీ కీలకంగా మారింది. పొన్నాలతో కేటీఆర్ సమావేశమైన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు నాగంతో కూడా కేటీఆర్ భేటీ అవుతారని అంటున్నారు.

Advertisement
Update:2023-10-29 13:01 IST

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల సమయంలో తనకు అవమానం జరిగిందంటూ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీని వీడారు. బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాటలో పయనించబోతున్నారు. ఈరోజు నాగంతో కేటీఆర్ భేటీ కాబోతున్నారని, ఆతర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరే విషయంలో తుది నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు.

నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరగా.. ఆయనకు అధిష్టానం టికెట్‌ ఖరారు చేసింది. దీంతో అధిష్టానంపై నాగం ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్‌ నేతలకే టికెట్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను నాశనం చేస్తున్నారని అన్నారు నాగం. కనీసం తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదన్నారు. బీఆర్‌ఎస్‌ లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు నాగం.

కేటీఆర్ భేటీ కీలకం..

గతంలో పొన్నాల విషయంలో కూడా మంత్రి కేటీఆర్ భేటీ కీలకంగా మారింది. పొన్నాలతో కేటీఆర్ సమావేశమైన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు నాగంతో కూడా కేటీఆర్ భేటీ అవుతారని అంటున్నారు. సాయంత్రం ఈ భేటీ తర్వాత నాగం బీఆర్ఎస్ చేరికపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News