మునుగోడు: రెండో రౌడ్ తర్వాత కూడా టీఆరెస్ దే ఆధిక్యం
మునుగోడు ఎన్నిక ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్ తర్వాత కూడా టీఆరెస్ ఆధిక్యం లో ఉంది.
మునుగోడు ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ ఓట్ల నుండి కూడా టీఆరెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మొదట చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. మొదటి రౌండ్ లో టీఆరెస్ కు 6478, బీజేపీకి 5126, కాంగ్రెస్ కు 2100 ఓట్లు లభించాయి. అయితే అదే చౌటుప్పల్ మండలానికి చెందిన రెండో రౌండ్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించింది. టీఆరెస్ కన్నా బీజేపీకి 789 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయినప్పటి కీ మొత్తం రెండు రౌండ్లు కలిపి ఇప్పటికీ టీఆరెస్ 515 ఓట్ల ఆధిక్యత ఉన్నది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆరెస్ కు 14249 ఓట్లు, బీజేపీకి13748, కాంగ్రెస్ కు 3632 ఓట్లు సాధించాయి. రెండో రౌండ్ లో పూర్తిగా చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఓట్లున్నాయి ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీన్ని బట్టి అర్బన్ లో బీజేపీ కొద్దిగా ఆధిక్యం లభిస్తుండగా రూరల్ పూర్తిగా టీఆరెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.