రామగుండంలో రావణుడు.. వెరైటీగా మోదీ పోస్టర్లు

హామీల అమలులో విఫలమైన మోదీ తెలంగాణ పాలిట రావణాసురుడంటూ విరుచుకుపడ్డారు. మోదీ ప్రామిసెస్ టు తెలంగాణ అనే క్యాప్షన్ పెట్టి మరీ ఈ పోస్టర్లు, బ్యానర్లు వేశారు.

Advertisement
Update:2022-11-12 11:20 IST

రామగుండం వస్తున్న మోదీ, రాముడు కాదు రావణుడంటూ స్థానికులు వేసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. 10 తలల మోదీ ఫొటో పెట్టి, ఆ తలల్లో తెలంగాణకు అమలు చేయకుండా మిగిలిపోయిన హామీలను అమర్చారు. హామీల అమలులో విఫలమైన మోదీ తెలంగాణ పాలిట రావణాసురుడంటూ విరుచుకుపడ్డారు. మోదీ ప్రామిసెస్ టు తెలంగాణ అనే క్యాప్షన్ పెట్టి మరీ ఈ పోస్టర్లు, బ్యానర్లు వేశారు.

1. ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్ అసలు ఏమైంది, ఎంతవరకు వచ్చింది.. ?

2. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు అతీగతీ ఏమైంది..?

3. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుపై ఇప్పటి వరకూ ఏం తేల్చారు..?

4. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి..?

5. మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారు..?

6. బయ్యారం స్టీల్‌ ప్లాంట్ ని ఏం చేశారు, ఎప్పుడు ఆ హామీ నెరవేరుస్తారు..?

7. పసుపు బోర్డ్ హామీ ఏమైంది..?

8. తెలంగాణకు కొత్తగా ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు..?

9. ఐఐఎం సంగతి ఏమైంది..?

ఇలా మోదీ తలలపై ఈ 9 ప్రశ్నలు సంధించారు. చివరిగా మోదీ తలపై పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి.. ఈయనెవరో చెప్పుకోండి అన్నట్టుగా సమాధానం ప్రజలకే వదిలేశారు. ఇక రామగుండంలో.. చేనేతపై విధించిన జీఎస్టీ తొలగించాలని, మోదీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. మొత్తమ్మీద మరోసారి మోదీకి తెలంగాణలో నిరసన సెగ తప్పేలా లేదు. ఆమధ్య బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పుడు మరోసారి మోదీకి నల్ల బెలూన్లతో స్వాగతం పలుకుతున్నారు.

Tags:    
Advertisement

Similar News