మోడీ ప్రభుత్వం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తోంది... ఒవైసీ
''ప్రస్తుతం మోడీ సర్కార్ కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే పనిలో బిజీగా ఉంది. మిగతా పనులన్నీ వదిలేసింది'' అని అసద్ ఆరోపించారు.
Advertisement
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసీఆర్ కుమార్తె కే కవితను విచారిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు , ఆయన కుటుంబ సభ్యులకు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం మద్దతుగా నిలిచారు.
తెలంగాణ అద్భుతమైన అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని, మోడీ ఆయనను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు.
''ప్రస్తుతం మోడీ సర్కార్ కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే పనిలో బిజీగా ఉంది. మిగతా పనులన్నీ వదిలేసింది'' అని అసద్ ఆరోపించారు.
మరో వైపు కవిత ను ఈడీ దాదాపు 6 గంటలుగా ప్రశ్నిస్తోంది. ఎప్పటి వరకు ఇది సాగుతుందనేది ఇంకా తెలియరాలేదు.
Advertisement