పేదలకు అండ.. బీఆర్ఎస్ జెండా

ఆర్య వైశ్యలు పది మందికి అన్నంపెట్టేవారు అనే పేరు ఉందని, ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ, వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తోంది తమ పార్టీయేనన్నారు ఎమ్మెల్సీ కవిత.

Advertisement
Update:2023-10-01 22:44 IST

పేదలకు అండ బీఆర్ఎస్ జెండా అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. పేదరికమే కొలమానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోందని చెప్పారు. ఏ కులంలో అయినా పేదవారు ఉంటే వారికి ప్రభుత్వం అండగా నిలబడుతూ పనిచేస్తోందన్నారు. నిజామాబాద్‌ లో బిగాల కృష్ణమూర్తి ఆర్యవైశ్య భవన్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఏ ప్రభుత్వమైనా చేదోడు వాదోడుగా నిలబడిందా? అని ప్రశ్నించారు కవిత. నిరుపేదల విషయంలో కులాలకు అతీతంగా తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని వివరించారు.

ఆర్య వైశ్యలు పది మందికి అన్నంపెట్టేవారు అనే పేరు ఉందని, ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ, వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తోంది తమ పార్టీయేనన్నారు ఎమ్మెల్సీ కవిత. నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికి అవకాశం కల్పించామని, భవిష్యత్తలో మరిన్ని అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్య భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 కోట్లను ఇచ్చిందని గుర్తు చేశారు కవిత.

స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్ధేశంతో నిజామాబాద్‌ లో ఇటీవల ఐటీ హబ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు కవిత. భవిష్యత్తులో మరిన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిజామాబాద్ కి వస్తాయని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న గణేష్ గుప్తాను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు కవిత. 

Tags:    
Advertisement

Similar News