మా సోదరుడి బిడ్డ పెళ్లికి రండి
సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మాజీ మంత్రి తలసాని
Advertisement
తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రిని తలసాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన సోదరుడి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.
Advertisement