ఇన్ స్పైర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

2023 జనవరిలో దావోస్‌ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌ లో ఇన్ స్పైర్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఆ సమావేశంలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకి ఒప్పందం కుదిరింది. నెలల వ్యవధిలోనే అది కార్యరూపం దాల్చింది.

Advertisement
Update:2023-09-13 16:39 IST

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటారస్ లో ఇన్ స్పైర్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ స్పైర్ సంస్థకు ఎంతో ప్రత్యేకం అని తెలియజేశారు నిర్వాహకులు. మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న ఇన్ స్పైర్.. హైదరాబాద్ లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ తో విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా ఇన్ స్పైర్ ప్రతినిధులతోపాటు, స్టాఫ్ అందరూ మంత్రి కేటీఆర్ తో ఫొటోలు దిగి సందడి చేశారు.


ఇన్ స్పైర్ సంస్థ వివిధ బ్రాండ్లతో ఆహార ఉత్పత్తులు, రెస్టారెంట్ల మార్కెట్ లో అగ్రగామిగా ఉంది. అమెరికాలో ఆర్బీస్ పేరుతో ఇన్ స్పైర్ సంస్థకు 3300 రెస్టారెంట్లు ఉన్నాయి. బస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ లు మనకు కూడా పరిచయమే. దీనికి కూడా ఇన్ స్పైర్ మాతృసంస్థ. బఫెలో వైల్డ్ వింగ్స్, డంకిన్ డోనట్స్, జిమ్మీ జాన్స్, సోనిక్ డ్రైవ్ ఇన్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా చైన్ రెస్టారెంట్లను కలిగి ఉంది ఇన్ స్పైర్. దీని ప్రధాన కార్యాలయం జార్జియాలోని అట్లాంటాలో ఉంది.

2023 జనవరిలో దావోస్‌ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌ లో ఇన్ స్పైర్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఆ సమావేశంలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకి ఒప్పందం కుదిరింది. నెలల వ్యవధిలోనే అది కార్యరూపం దాల్చింది. దాదాపు 6.5 లక్షలమంది ఈ సంస్థలో ఉద్యోగులుగా ఉన్నారు. అలాంటి సంస్థ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు మంత్రి కేటీఆర్. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ కు హైదరాబాద్ బలమైన కేంద్రంగా ఎదుగుతోందని, దీనికి తాజా నిదర్శనం ఇన్ స్పైర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని అన్నారాయన. 

Tags:    
Advertisement

Similar News