బీజేపీ నాయకులకు బుద్దుందా : మంత్రి కేటీఆర్
బీజేపీ నాయకులకు బుద్దిమాంద్యం ఉన్నట్లు కనపడుతున్నది. వీళ్లందరూ తెలివి లేని వ్యక్తులు. కేవలం బీజేపీ నాయకులే కాదు. వారికి మద్దతు పలికే వారు కూడా అదే కోవలోకి చెందుతారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ బీజేపీ నాయకులపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు వాళ్లు ఏం చేస్తున్నారో కనీస ఆలోచన, బుద్ది ఉన్నదా అని ప్రశ్నించారు. ఇటీవల కమలాపూర్ బాయ్స్ హైస్కూల్ నుంచి టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ చేసిన కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్.. బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ సందర్భంగా బీజేపీ నాయకులు అతనికి దండలేసి, శాలువాతో సత్కరించారు. పేపర్ లీక్ కేసులో నిందితుడి పట్ల బీజేపీ నాయకుల వ్యవహారశైలి చూసి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
'బీజేపీ నాయకులు బిల్కిస్ బానో రేప్ కేసు నిందితులు విడుదలైతే సంబరాలు చేసుకుంటారు. యూపీలో హత్య కేసు నిందితులను స్వయంగా కేంద్ర మంత్రే ఎదుర్కొని వెళ్లి స్వాగతిస్తుంటారు. ఇక యూపీలో అయితే జాతి పిత మహాత్మా గాంధీ బొమ్మను తుపాకీతో కాలుస్తున్నట్లు ఫోజులు పెడతారు. చివరికి తెలంగాణలో ఎస్సెస్సీ పేపర్ లీక్ చేసిన వ్యక్తిని ఘనంగా స్వాగతిస్తారు' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
బీజేపీ నాయకులకు బుద్దిమాంద్యం ఉన్నట్లు కనపడుతున్నది. వీళ్లందరూ తెలివి లేని వ్యక్తులు. కేవలం బీజేపీ నాయకులే కాదు. వారికి మద్దతు పలికే వారు కూడా అదే కోవలోకి చెందుతారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలని.. నిందితులకు కూడా సన్మానాలు చేసే పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు.