రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకంటే..?

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement
Update:2023-07-11 13:30 IST

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నిరసనలు ఎందుకంటే..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది అనుచితంగా మారిందని, కేవలం విద్యుత్ కంపెనీలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులకు రోజుకి 3 గంటలసేపు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందన్నారాయన. అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కాగా.. బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన మంత్రి కేటీఆర్.. ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచనా విధానం మరోసారి బట్టబయలైందని అన్నారు మంత్రి కేటీఆర్. రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ కి ఉందన్నారు. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News