కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు సబబే : నాంపల్లి కోర్టు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున పిటిషన్‌కు కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్‌ సింగ్‌ ఇవాళ కౌంటర్‌ దాఖలు చేశారు

Advertisement
Update:2024-11-21 15:52 IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనాగార్జున పిటిషన్‌కు కొండా సురేఖ తరుపు లాయర్ గురుప్రీత్‌ సింగ్‌ ఇవాళ కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసిన విషయం తెలిసిందే. నాగార్జున‌తో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్‌లను కూడా నమోదు చేసింది.

 మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని ఫ్యామిలీ మానసికంగా కుంగిపోయిందని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మంత్రి పెట్టిన పోస్టును న్యాయవాది చదివి కోర్టుకు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొండా సురేఖ కచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలు అన్నారు. అయితే కొండా చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. త‌న కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠతను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

Tags:    
Advertisement

Similar News