బెడ్ రూమ్ దగ్గరికి వచ్చి అరెస్టు చేయడానికి నేను క్రిమినల్‌నా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తున్నదో అందరూ గమనిస్తున్నారని కౌశిక్ రెడ్డి ధ్వజం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి పీఎస్ లోపలికి వెళ్లారు. విచారణ ముగిసిన అనంతరం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తున్నదో అందరూ గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతగల పౌరుడిగా విచారణకు సహకరించడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు. గతంలో బంజారాహిల్స్‌లో పిటిషన్ ఇవ్వడానికి సీఐ దగ్గరికి వెళ్తే ఆయన లేచి పరుగులు పెట్టబోయారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా నేను స్టేషన్‌కు వచ్చినప్పుడు సీఐగా ఆయన బైటికి పరుగులు పెట్టొచ్చా? ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలా? వద్దా? సీఐ బైటికి వెళ్తున్న క్రమంలో.. నేను పిటిషన్ ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. పిటిషన్ తీసుకుని వెళ్తే అయిపోతుందు కదా అన్నాను.
పిటిషన్ ఇచ్చిన రెండు గంటల తర్వాత నాపై కేసులు నమోదు చేశారు. వందలాది మంది పోలీసులను తర్వాత రోజు నా ఇంటికి పంపించారు. డోర్లు పగలగొట్టి నా బెడ్ రూమ్ దగ్గరికి వచ్చి అరెస్టు చేశారు. నా ఇంటి డోర్లు పగులగొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? నా బెడ్‌రూమ్ దగ్గరికి వచ్చి అరెస్టు చేయడానికి నేను క్రిమినల్‌నా? అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.