వారెవ్వా హరీషన్న.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను మించిపోతున్నాడుగా!
బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు రాజకీయ నేతగా ఎంత సమర్థుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల వ్యూహంలోనే కాదు రాజకీయ ప్రసంగాల్లోనూ దిట్ట. ఇప్పుడు ఆయన పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చి పాడేస్తున్నారు.
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు రాజకీయ నేతగా ఎంత సమర్థుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల వ్యూహంలోనే కాదు రాజకీయ ప్రసంగాల్లోనూ దిట్ట. ఇప్పుడు ఆయన పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చి పాడేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగుల్లా పేలుతున్న ఆ పొలిటికల్ పంచ్‌ల్లో మచ్చుకు కొన్ని..
మూడు గంటలా.. మూడు పంటలా?
కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి మూడు గంటలే ఉచిత కరెంటు ఇస్తోందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను హరీష్‌రావు తిప్పి కొట్టారు.
తమ హయాంలో మూడు పంటలు పండించుకునే స్థాయిలో నీళ్లు, కరెంటు ఇస్తున్నామని.. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే వాళ్లంటున్న మూడు గంటలే కరెంటు ఇస్తారని మండిపడ్డారు. మూడు గంటలా.. మూడు పంటలా ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
ఇటు నమ్మకం.. అటు అమ్మకం
ప్రజల నమ్మకానికి కేసీఆర్ మారుపేరుగా నిలుస్తుంటే.. ప్రతిపక్షాలు అమ్మకానికి మారుపేరుగా మారాయని హరీష్‌రావు విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు సీట్లు, పదవులు అన్నీ అమ్ముకుంటాయని మెదక్ సభలో మండిపడ్డారు. రంగస్థలం సినిమాలో హీరో రామ్‌చరణ్ పాడినట్లు ఆ గట్టునుంటారా.. ఈ గట్టునుంటారా అంటూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.
అటు తిట్లు.. ఇటు పుట్లు
ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక తిట్ల పురాణం అందుకుంటుంటే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఎకరాకూ నీళ్లిచ్చి పుట్ల కొద్దీ ధాన్యం పండిస్తోందని వర్ణించారు. అటు తిట్లు.. ఇటు పుట్లు అంటూ పంచ్ డైలాగులు పేల్చారు.