తల్లి అంజనా దేవీ ఆరోగ్యంపై చిరంజీవి క్లారిటీ
తన తల్లి ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు.
తన తల్లి అంజనా దేవీ ఆరోగ్యంపై మెగా స్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అస్వస్థతకు గురయ్యారంటూ గతకొన్ని రోజులు మీడియంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి.
రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని.. ఆసుపత్రిలో చేరిందని అంటున్నారు. అందుకే ఫ్యాన్స్, శ్రేయాభిలాషులతో పాటు మీడియాకు ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. ఆమె చాలా ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. దయచేసి అన్ని అన్ని మీడియా సంస్థలు గమనించగలరు’ అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.