నా మీద పగతో పాలమూరు ప్రాజెక్టులను పక్కకు పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి
గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లాకు న్యాయం జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘పదేళ్ల పాటు ఏగ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదన్నారు. గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేమీ లేదు. భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు.
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. వైఎస్‌ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదు. టీ బీజేపీ చీఫ్.తాము అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలోనే ఎన్నో పనులు చేశామని అన్నారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్ధమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, చారిత్రాత్మక కులగణన చేసి చూపించామని ముఖ్యమంత్రి తెలిపారు