యాదగిరిగుట్ట మహా కుంభాభిషేకానికి కేసీఆర్‌కి ఆహ్వానం
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు
Advertisement
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ని కోరారు.
Advertisement