ఏపీకి వెంటనే నీటిని నిలిపివేయాలని..కేఆర్‌ఎంబీ బోర్డుకి లేఖ

ఏపీకి నీటి విడుదలను నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ బోర్డు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది

Advertisement
Update:2025-02-21 20:43 IST

నాగార్జున సాగర్, శ్రీశైలం నుండి ఏపీకి నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏపీ ఇంకా నీటిని ఎందుకు తీసుకుంటోందని, రాష్ట్రానికి కేటాయించిన దానికంటే ఎక్కువ వాడుకున్నా రెండు రాష్ట్రాలు నీటి వినియోగ ప్రణాళికను సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ పేర్కొంది. ఈ క్రమంలో నాగార్జున సాగర్, శ్రీశైలం నుండి ఏపీకి నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ బోర్డుకి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి అక్రమంగా జల దోపిడి జరుగుతుంది పేర్కొంది.

ఈ క్రమంలో రేవంత్ సర్కార్ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే తన వాటాకు మించి వినియోగించుకుందని, ఈ పరిస్థితుల్లో ప్రేక్షక పాత్ర పోషించకుండా తగు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది. నాగార్జునసాగర్‌ నుంచి, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందని, ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకొన్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని రెండు రాష్ట్రాలను కోరడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ బుధవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

Tags:    
Advertisement

Similar News