ప్రభుత్వ సమాచారాన్ని అధికారులు లీక్ చేస్తున్నారు : మధుయాష్కీ

ప్రతిపక్షంతో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారంటూ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2025-02-21 18:01 IST

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంతో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారంటూ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కీలక అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయపరిణామాలపై ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్ అండతోనే జీఏస్టీ కుంభకోణం జరిగింది.

దోచిపెట్టిన ,దాచి పెట్టిన అధికారుల పై విచారణ జరగాలి. అభయ్ కుమార్ లాంటి వారి పై చర్యలు అవసరం. విచారణలో వేగం లేనందునే కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంక్వరీ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగడం లేదు. సింగరేణిలో కవిత కు అన్ని రకాలుగా సహాకరించిన అధికారి ..మా ప్రభుత్వం లో ఉన్నత స్థానంలో ఉన్నారు. సంధి కాలం ముగిసింది.. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలి. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు’అని మండిపడ్డారు.  

Tags:    
Advertisement

Similar News