ఎంఐఎం అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు ఎమ్మెల్యేలు ఔట్!
ప్రస్తుతమున్న ఏడుగురు ఎమ్మెల్యేల స్థానాలతో పాటు ఈ సారి రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్ స్థానాల్లో పోటీ చేయనుంది ఎంఐఎం. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయిద్ అహ్మద్ పాషా ఖాద్రీలను పోటీ నుంచి తప్పించింది.
తెలంగాణలో నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది ఎంఐఎం పార్టీ. ఈ సారి 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మొదటి లిస్ట్‌లో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్.. మరో మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.
చాంద్రయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్, మలక్‌పేట నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పోటీ చేయనున్నారు. నాంపల్లి నుంచి మహ్మద్ మజీద్ హుస్సేన్, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మీరాజ్‌లకు అవకాశం ఇచ్చింది.
ప్రస్తుతమున్న ఏడుగురు ఎమ్మెల్యేల స్థానాలతో పాటు ఈ సారి రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్ స్థానాల్లో పోటీ చేయనుంది ఎంఐఎం. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయిద్ అహ్మద్ పాషా ఖాద్రీలను పోటీ నుంచి తప్పించింది. అహ్మద్ ఖాన్ స్థానంలో చార్మినార్ నుంచి జుల్ఫికర్‌కు అవకాశం ఇచ్చింది. అహ్మద్ పాషా స్థానంలో జాఫర్ హుస్సేన్‌ను పోటీలో ఉంచింది. బహదూర్‌పురా, జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.