జమ్ము కశ్మీర్‌లో భారీ భూకంపం
జమ్ము కశ్మీర్ లోయలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భుకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
జమ్ము కశ్మీర్ లోయలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భుకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం తీవ్రత 5.1గా ఉంది. అయితే, పాకిస్థాన్ వాతావరణ విభాగం దానిని 5.3 తీవ్రతగా నివేదించింది. భూకంపం కేంద్రం ఆఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో గుర్తించినట్లు ఇస్లామాబాద్‌లోని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది.
భూమికి 220 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. భూమికి 220 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.ఈ భూకంపం ధాటికి లోయలోని పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కశ్మీర్ లోయతోపాటు పాకిస్థాన్‌లోని ఖైబర్‌ఫంక్తుఖ్వా, ఇస్లామాబాద్, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.