ఎన్ని అడ్డంకులు సృష్టించినా 50 వేల ఉద్యోగాలిచ్చాం
త్వరలోనే గ్రూప్ -1 నియామక పత్రాలు ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. త్వరలోనే 563 మందికి గ్రూప్ -1 నియామకపత్రాలు అందజేస్తామన్నారు. టీజీపీఎస్సీని కేసీఆర్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, ఆర్‌ఎంపీ డాక్టర్‌ను, తహశీల్దార్‌ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించారని అన్నారు. తమ ప్రభుత్వం అలా చేయదల్చుకోలేదన్నారు. అందుకే సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించామని, చిన్న ఆరోపణల లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి విద్య, వైద్యమే ప్రాధాన్యత అన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
Advertisement