హైదరాబాద్‌కు బల్క్ డ్రగ్ పార్క్‌పై పార్లమెంటును తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు చెప్పిన‌ కేంద్రమంత్రి

బీఆరెస్ స్పందనకు సానుకూలంగా స్పందించిన మాండవీయ‌ సభలో తాను చేసిన ప్రకటనను సరిదిద్దాలని నిర్ణయించారు.దీనిపై స్పందిస్తూ కేంద్ర మంత్రి నామా నాగేశ్వరరావుకు రాసిన లేఖలో క్షమాపణలు చెప్పారు.

Advertisement
Update:2022-12-23 08:20 IST

హైదరాబాద్‌కు కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయించిందని, దాని ఏర్పాటుకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని లోక్‌సభలో తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తన తప్పును ఒప్పుకున్నారు.

బల్క్ డ్రగ్ పార్కులపై బీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాండవ్య పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అనే మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించినట్లు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. కానీ మౌఖిక సమాధానంలో మాత్రం హైదరాబాద్‌కు కూడా బల్క్ డ్రగ్ పార్క్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు.

దీంతో మంత్రి సభను తప్పుదోవ పట్టించినందుకు భారత రాష్ట్ర సమితి అభ్యంతరాలు లేవనెత్తింది.దీనిపై బీఆర్‌ఎస్ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.అయితే దీనిపై తొలుత మాండవీయ‌తో చర్చించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

బీఆరెస్ స్పందనకు సానుకూలంగా స్పందించిన మాండవీయ‌ సభలో తాను చేసిన ప్రకటనను సరిదిద్దాలని నిర్ణయించారు.దీనిపై స్పందిస్తూ కేంద్ర మంత్రి నామా నాగేశ్వరరావుకు రాసిన లేఖలో క్షమాపణలు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News