మందు పార్టీకి అనుమతి కోసం మంత్రి పొన్నంకి లేఖ

మద్యం ఎక్కడ తాగాలో చెప్పాలని ఓ మందుబాబు మంత్రి పొన్నం ప్రభాకర్ కి తాజాగా లేఖ రాశారు.

Advertisement
Update:2024-10-29 20:00 IST

మందు ఎక్కడ తాగాలో చెప్పాలని ఓ మందుబాబు ఏకంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కి లేఖ రాశారు. నిన్న మంత్రి పొన్నం మీడియా సమావేశంలో ఒక్కరు ఇద్దరూ.. మినహా ఎక్కువ మంది మద్యం తాగాలంటే.. పర్మిషన్ తప్పని సరిగ్గా తీసుకోవాలని.. ఏదైనా మందు పార్టీలు ఫంక్షన్లు చేసినప్పుడు కూడా అనుమతి లేకుండా మద్యం సేవిస్తే.. పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓ మందు బాబు నెలలో ప్రతీ ఆదివారం దోస్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటాడు అయితే తెలంగాణలో మొన్న జరిగిన కొన్ని సంఘటనలతో వల్ల మేము స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తోంది. పక్కా అనుమతి తీసుకోవాలని మీరు సూచించారు.

దీంతో మాకు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఫర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి.. ముఖ్యమంత్రి దగ్గరా..? మీ వద్దనా..? ఎక్సైజ్ శాఖ వద్దనా..? ఒక క్లారిటీ ఇస్తే.. అనుమతి తీసుకొని నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటానని సదరు మద్యం ప్రియుడు లేఖలో పేర్కొన్నారు. ఎక్కువ మంది కలిసి మద్యం తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News