రేవంత్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దాం
పట్నం నరేందర్‌రెడ్డితో ములాఖత్ అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలు
భూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..30 మంది అమాయక రైతులను జైల్లోపెట్టారు. వాళ్ల కోసం పోరాటం చేయండి. ఫార్మా విలేజ్‌ను ప్రజలపై రద్దుతున్నారని.. అక్కడి పేదల పక్షాన పోరాడాలని ములాఖత్ సందర్భంగా పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. భూములు ఇవ్వమని అన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు అరాచకాలు చేస్తున్నారు. కొడంగల్ సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పాలనలో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి దారి లేకుండా చేస్తే అవమానం భరించలేక క్షోభతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి చక్రవర్తి, నియంత కాదు. సొంత నియోజకవర్గమైతే అదేమైనా మీ సామ్రాజ్యమా? నాడు శిశుపాలుని పాపాలు లెక్క పెడుతున్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరిట దౌర్జన్యాలు చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఇవ్వబోమన్న ఒకే ఒక్క మాటకు 30 మందికిపైగా రైతులు జైళ్లలో మగ్గుతున్నారు. వారి కుటుంబాలకు మేం ఒక్కటే చెబుతున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు.