దేశంలో జనగణనలో కులగణన చేపట్టాలి : సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో కులగణన చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.

Advertisement
Update:2024-12-26 21:45 IST

దేశంలో కులగణన చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతు దేశంలో లోక్ సభ నియెజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశలు ఉన్నాయని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన జరిగేతే దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెంపు తక్కువ ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందన్నారు. అందు వల్ల ఏఐసీసీ వ్యుహాత్మకంగా ఆలోచించాలి అని తెలిపారు.చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చాం. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కవగా ప్రచారం చేయాలి.బీజేపీ.. మహిళా బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయి.

ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలంగాణలో కులగణన దేశంలోనే మార్గదర్శిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలి. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News