హిస్టరీ రిపీట్ అవడం ఖాయం - కేటీఆర్
పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో BRS ఎమ్మెల్యేలను లాక్కోవడంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు కారు దిగారు.
ఎమ్మెల్యేలు వరుసగా BRS పార్టీని వీడటంపై స్పందించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చరిత్ర పునరావృతం కావడం ఖాయం అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఐదుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే..
అధికారంలో ఉన్న వాళ్ళ పవర్ కంటే సామాన్య పౌరుల పవర్ చాలా గొప్పదన్నారు కేటీఆర్. 2004 -06 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను చూశామన్నారు. అప్పుడు ప్రజల తిరుగుబాటుకు కాంగ్రెస్ తలవంచిందని గుర్తుచేశారు. చరిత్ర తనకు తానుగా పునరావృతం కావడం ఖాయమన్నారు.
పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో BRS ఎమ్మెల్యేలను లాక్కోవడంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు కారు దిగారు. BRSLP విలీనం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇందుకోసం మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. అటు మండలిలోనూ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.