పదేళ్ల నుంచి హామీల పాతర.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర..?

ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానీకి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి.. అని మోదీపై సెటైర్లు పేల్చారు కేటీఆర్. తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని అన్నారు.

Advertisement
Update:2023-10-03 11:35 IST

మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. పదేళ్ల నుంచి హామీలకు పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర అంటూ మండిపడ్డారు. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. అని అడిగారు. గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలు దించుతారా అంటూ నిలదీశారు మంత్రి కేటీఆర్.


ఆ మూడు ప్రశ్నలు ఇవే..

1. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

2. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

3. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?

అంటూ మోదీకి మూడు ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. విభజన హక్కుల్ని కాలరాసి ఏ మొహం పెట్టుకుని మూడు రోజుల్లో రెండుసార్లు తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. హామీలు నిలబెట్టుకోకపోగా.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అడ్డుపడ్డారని చెప్పారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు మళ్లీ ద్రోహం చేసి వెళ్లిపోయారన్నారు కేటీఆర్.

డిపాజిట్లు గల్లంతే.. జాగ్రత్త

ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానీకి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి.. అని మోదీపై సెటైర్లు పేల్చారు కేటీఆర్. తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని అన్నారు. మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని చెప్పారు కేటీఆర్. 


Tags:    
Advertisement

Similar News