కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సు -కేటీఆర్

నిన్న, నేడు, రేపు.. ఎప్పుడయినా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు మంత్రి కేటీఆర్. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన రోజే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-10-19 11:01 IST

కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని ప్రశ్నించారు. మూడు రోజుల పర్యటన చేసినా, మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని అన్నారు కేటీఆర్.

తెలంగాణకు కాంగ్రెస్సే విలన్..

నిన్న, నేడు, రేపు.. ఎప్పుడయినా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు మంత్రి కేటీఆర్. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన రోజే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని ఎద్దేవా చేశారు. ల్యాండ్ మాఫియాకు తెలంగాణ పీసీసీ చీఫ్ కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంతు.. అని కౌంటర్ ఇచ్చారు. రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్ అన్నారు. తమ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందన్నారు. గాంధీభవన్ రిమోట్ గాడ్సే చేతిలో మాడి మసైపోతోందని చెప్పారు కేటీఆర్.

సంక్షేమం మాది, చీకటి పాలన మీది..

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అయితే, చీకటి పాలనకు చిరునామా కర్నాటక అని విమర్శించారు కేటీఆర్. కర్నాటకలో ప్రజలకిచ్చిన హామీలకు వంద రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం తమది అని చెప్పారు. కర్నాటకలో ఐదు గంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని, రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ, తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమది అని చెప్పారు. నమ్మి ఓటేసిన కర్నాటక ప్రజలను నట్టేట ముంచి, తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు కేటీఆర్.

దశాబ్దాలుగా పోడు భూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. 4.50 లక్షల ఎకరాల భూములు అడవి బిడ్డలకు పంచి, వారికి పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం తమది అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణం అని, శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదన్నారు కేటీఆర్

Tags:    
Advertisement

Similar News