పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగం

సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఫైర్‌

Advertisement
Update:2024-11-12 11:21 IST

సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తిరగబడుతోంది... తెలంగాణ తల్లడిల్లుతోంది.. తమ ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లగాయించి ఎదురొడ్డుతుందన్నారు. మా భూములు మాకేనని కొడంగల్‌ కొట్లాడుతున్నది. కుట్రలు కుతంత్రపు పాలనలో నా తెలంగాణ గరమైతున్నది. అసమర్థ సీఎం ఏలుబడిలో రాష్ట్రం కొనసాగుతున్న అసంతృప్తులివి అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నరోడ్లెక్కారు. మూసీలో ఇళ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటున్నది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని రైతన్న కన్నెర్ర చేశారని కేటీఆర్‌ తెలిపారు. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags:    
Advertisement

Similar News