డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టీ హబ్ ఒప్పందం.. అభినందనలు తెలిపిన కేటీఆర్
ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్ కు 'డల్లాస్ వెంచర్ క్యాపిటల్' ఫండింగ్ చేయనుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ టీ హబ్ కు ఫండింగ్ చేస్తున్నందుకు డల్లాస్ వెంచర్ సంస్థకు అభినందనలు తెలిపారు.
టీహబ్ రోజు రోజుకు వేగంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రాష్ట్రప్రభుత్వం, ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడ వల్ల టి హబ్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఈ రోజు టీ హబ్ డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్ కు 'డల్లాస్ వెంచర్ క్యాపిటల్' ఫండింగ్ చేయనుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ టీ హబ్ కు ఫండింగ్ చేస్తున్నందుకు డల్లాస్ వెంచర్ సంస్థకు అభినందనలు తెలిపారు.
టీ హబ్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని చెప్పిన కేటీఆర్ భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందని గుర్తు చేశారు. భారత దేశంలో అనేక స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన డల్లాస్ వెంచర్ సంస్థ టీ హబ్ తో ఒప్పందం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలో ఉద్యోగ కల్పన కల్పించాలన్న డల్లాస్ వెంచర్ సంస్థ ఆలోచనను కేటీఆర్ కొనియాడారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 6 వేలకు పైగా స్టార్టప్ లు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సరైన ప్రణాళిక, మంచి ఆలోచనలు ఉన్న స్టార్టప్ సంస్థలకు నిధులు లభించడం కష్టం కాదని కేటీఆర్ అన్నారు.