ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకంటే..?

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి యూసఫ్ గూడలో సమీక్ష చేపట్టారు. దీనికోసం అక్కడికి వచ్చిన కేటీఆర్, తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కారు.

Advertisement
Update: 2024-01-27 12:14 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో ఎక్కారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీని వదిలి ఆయన ఓ సామాన్యుడిలో ఆటోలో ప్రయాణించారు. సడన్ గా ఆయన ఆటోని ఆపడంతో డ్రైవర్ కూడా షాకయ్యారు. కేటీఆర్ తన ఆటో ఎక్కినందుకు సంబరపడ్డారు. ఆటోవాలాల కష్టాలను హైలైట్ చేసేందుకే ఆయన కారు దిగి ఆటో ఎక్కినట్టు తెలుస్తోంది. యూసఫ్ గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు కేటీఆర్.


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమీక్షలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి యూసఫ్ గూడలో ఈ సమీక్ష చేపట్టారు. దీనికోసం అక్కడికి వచ్చిన కేటీఆర్, తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఆటోలోనే ప్రయాణించారు. యూసఫ్ గూడలో ఆటో ఎక్కిన కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద దిగారు.

ఆటో డ్రైవర్ల కష్టాలపై గతంలో కూడా కేటీఆర్ పలుమార్లు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైంది. దీంతో వారంతా తమ బాధలను ప్రభుత్వానికి చెప్పుకునే ప్రయత్నం చేశారు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై ఆలోచన చేయలేదు. కనీసం వారి విన్నపాలు వినేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో మరోసారి కేటీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆటో డ్రైవర్ల కష్టాలు హైలైట్ అయ్యేలా వారికి మద్దతుగా నిలిచారు. ఆటోలో ప్రయాణించారు. 

Tags:    
Advertisement

Similar News