కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం...వాళ్లకు నో ట్రీట్మెంట్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారని అందుకే బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయమని కోల్‌కతా ఆసుపత్రి నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2024-11-30 18:08 IST

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జేఎన్‌ రే ఆసుపత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ చెందిన రోగులకు ట్రీట్మెంట్ చేయబోమని ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇవాళ నుంచి నిరవధిక సమయం వరకు బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని మేం నోటిఫికేషన్ జారీ చేశాం. భారతదేశం పట్ల వారు చూపిన అవమానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు. కాగా, బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యంలో భారత్‌ ముఖ్యమైన పాత్ర పోషించిందని సుభ్రాంషు భక్త్ గుర్తు చేశారు.

అయినప్పటికీ భారత్‌ వ్యతిరేక భావాన్ని వారు ప్రదర్శిస్తున్నారని, త్రివర్ణ పతాకాన్ని అవమానించారని విమర్శించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై అకృత్యాలకు నిరసనగా నగరంలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సుభ్రాంషు భక్త్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశీయులకు చికిత్స చేయకూడదన్న తమ నిర్ణయానికి ఇతర ఆసుపత్రుల మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే ఇతర ఆసుపత్రులు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయని తాము ఆశిస్తున్నామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News