నామా నాగేశ్వర రావుకు కేంద్రమంత్రి పదవి.. ఖమ్మం రోడ్‌షోలో కేసీఆర్
తెలంగాణలోని 17 స్థానాల్లో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఖమ్మం ప్రజలు నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో ఈసారి వచ్చేది ముమ్మాటికి సంకీర్ణప్రభుత్వమేనన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావుకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంలో బీజేపీకి 370, 400 కాదు కదా.. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణలోని 17 స్థానాల్లో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఖమ్మం ప్రజలు నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో పంజాబ్‌ను తలదన్నే స్థాయిలో వడ్లు పండించామన్న కేసీఆర్.. 3.5 కోట్ల టన్నుల దిగుబడి సాధించామన్నారు. వడ్లు కొనబోమని కేంద్రం మొండికేస్తే.. నామా ఆధ్వర్వంలో బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి కేంద్రమంత్రిని కలిశారని గుర్తుచేశారు. నూకలు తినాలంటూ కేంద్రమంత్రి హేళన చేశారన్నారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ఓట్లు మాత్రమే కావాలని.. రైతుల సమస్య పట్టదన్నారు.