నీటమునిగినా నష్టం లేదు.. కాళేశ్వరం సేఫ్..

అన్నారం, కన్నేపల్లి పంప్‌ హౌస్‌ ల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదట పంప్‌ హౌస్‌ లో చేరిన నీటిని, ఆ తరువాత బురదను ఒక్కో ఫ్లోర్‌ వారీగా తొలగిస్తున్నారు.

Advertisement
Update:2022-07-31 08:27 IST

గోదావరి వరదలకు కాళేశ్వరం పంప్ హౌస్ లు నీట మునిగిన సందర్భంలో.. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేశాయో చూశాం. వరదలొస్తే మునిగిపోయే ప్రాంతాల్లో పంప్ హౌస్ లు నిర్మించారంటూ లాజిక్ లేకుండా మాట్లాడారు బీజేపీ నేతలు. మోటర్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్ట కంపెనీలకు ఉంటుందని, ప్రభుత్వంపై కానీ, ప్రజలపై కానీ భారం పడదని మొత్తుకున్నా వినలేదు. తీరా ఇప్పుడు మోటర్లకు నష్టమేమీ లేదని తేలింది. నీట మునగడం వల్ల మోటర్లు పాడు కాలేదని, వాటి పనీతీరు బాగానే ఉందని స్ఫష్టమైంది.

అన్నారం, కన్నేపల్లి పంప్‌ హౌస్‌ ల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదట పంప్‌ హౌస్‌ లో చేరిన నీటిని, ఆ తరువాత బురదను ఒక్కో ఫ్లోర్‌ వారీగా తొలగిస్తున్నారు. అన్నారం పంప్‌ హౌస్‌ లో చేరిన నీరు, బురదను ఇప్పటికే పూర్తిగా తొలగించి తేమ లేకుండా చేశారు. పంప్‌ హౌస్‌ నిర్మాణాలకు, అందులోని మొత్తం 12 మోటర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. రెండు మోటర్లకు సాంకేతిక పరీక్షలు కూడా నిర్వహించారు. పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మిగతా మోటర్లకు కూడా ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ఆగస్ట్ చివరికల్లా మోటర్లు ఆపరేట్ చేసేలా చూస్తామంటున్నారు.

రెండు నెలల్లో అన్నీ సిద్ధం..

రెండు నెలల లోపు పంప్‌ హౌస్‌ మొత్తాన్ని తిరిగి వినియోగంలోకి తెస్తామంటున్నారు అధికారులు. అటు కన్నేపల్లి పంప్‌ హౌస్‌ లో వరద నీరు తోడే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం పంప్‌ హౌస్‌ లోని మొత్తం 17 మోటర్ల సామర్థ్యం పరీక్షిస్తారు. ఎలక్ట్రిక్‌ పరికరాల పరిస్థితిపై ఓ అంచనాకు వస్తారు. మొత్తమ్మీద పంప్ హౌస్ లకు సంబంధించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడానికి ఏమీ మిగల్లేదు. మోటర్ల పనితీరు సరిగా ఉండటంతో రాజకీయాలకు తావు లేకుండా పోయింది. ఒకవేళ మోటర్ల పనితీరు సరిగా లేకపోయినా కాంట్రాక్ట్ కంపెనీలే వాటి నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తాయి.

Tags:    
Advertisement

Similar News