జబర్దస్త్ రాంప్రసాద్‌కు రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్‌కు గాయాలయ్యాయి. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది.
Advertisement
హైదరాబాద్ ఓఆర్ ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్‌కు గాయాలయ్యాయి. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది. రాంప్రసాద్ షూటింగ్ స్పాట్‌కు వెళుతుండగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో రాంప్రసాద్ కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతని కారు బాగా దెబ్బతిన్నది. రాంప్రసాద్ గాయపడడంతో అతడిని 108లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement