చిరు బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన మణిశర్మ

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement
Update:2025-02-19 15:32 IST

మెగా స్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం తన వంతుకర్తవ్యంగా భావిస్తున్నాన‌న్న మణి శర్మ పేర్కొన్నాడు.. ‘‘ఎప్ప‌టి నుంచో రక్త దానం చేయాలని అనుకుంటున్నాను. మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ అందించటం ద్వారా ఆయ‌న‌పై అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం అనేది సంతోషంగా ఉంది. నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమ‌య్యారు. అందులో నేను ఒక బొట్టులాగా ఇప్పుడు చేరాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’’ అని సంగీత ద‌ర్శ‌కుడు చెప్పుకొచ్చారు

Tags:    
Advertisement

Similar News