పాలమూరు రైతులకు మేలు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే : సీఎం రేవంత్‌రెడ్డి

గతేడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబడ్డారు. నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడూ అనుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-11-30 19:31 IST

పాలమూరు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వామేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..గతేడాది నవంబర్‌ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్‌ 30 ప్రాధాన్యత ఉన్న రోజు. గతేడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబడ్డారు. నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడూ అనుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు పాలమూరు బిడ్డల కన్నీళ్లను నేను చూశాను. 70 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం వచ్చింది. పాలమూరు కష్టాలు నాకు తెలుసు. రైతుల కష్టాలు కూడా నాకు తెలుసు. ఏడాది పాలనలో రూ.54వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. ఏడాది క్రితమే నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాం. సీఎం పదవి బాధ్యత.. జవాబుదారితనంతో పని చేస్తున్నాను. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి, హైదరాబాద్‌కు వలస పోయాయి. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని రేవంత్ పేర్కొన్నారు.

ఈరోజు వరి పంట వేసుకుంటే రూ.500 బోనస్‌ ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు. ఆనాడు వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్‌ కాదా?. కాళేశ్వరానికి లక్షా రెండువేల కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా రికార్డు స్థాయిలో సాగు జరిగింది. గతంలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకున్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు. బీఆర్‌ఎస్‌ మాటలు నమ్మి గిరిజనులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే నాగార్జున సాగర్‌, శ్రీశైలం కట్టేవాళ్లా. కొండగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని నేను అనుకున్నాను. లగచర్లలో కుట్ర ప్రకారమే దాడి జరిగింది. గొడవ చేసి మంపెట్టారు. విపక్షాల వలలో పడొద్దు. రైతులు కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. వినకుండా కొందరు ఆవేశపడ్డారు. ఈ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి విమర్మించారు 

Tags:    
Advertisement

Similar News