కేంద్ర మంత్రి పదవి కాదు.. బండికి పార్టీ పదవితో సరిపెట్టిన బీజేపీ
బండి సంజయ్‌కి బీజేపీ పార్టీ జాతీయ స్థాయి పదవి కట్టబెట్టింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించే సమయంలో అనేక ప్రచారాలు జరిగాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినా.. కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. బీజేపీ శ్రేణులు కూడా బండి సంజయ్‌కు మంత్రి పదవి గ్యారెంటీ అని డిసైడ్ అయ్యాయి. బండి సంజయ్ ప్లేస్‌లో కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ, సంజయ్ మంత్రి పదవి ఊసే లేకుండా పోయింది. అకస్మాతుగా బండి సంజయ్‌కి బీజేపీ.. పార్టీ జాతీయ స్థాయి పదవి కట్టబెట్టింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది. జాతీయ పార్టీ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. త్వరలో తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 13 మంది ఉపాధ్యక్షులు, 13 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. బీజేపీ జాతీయ ఇంచార్జిగా బీఎస్ సంతోశ్‌ను కొనసాగిస్తూనే.. కొత్త నియామకాలు చేపట్టినట్లు జేపీ నడ్డా పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు..
1. రమణ్ సింగ్, చత్తీస్‌ఘఢ్
2. వసుంధరా రాజే, రాజస్థాన్
3. రఘువర్ దాస్, జార్ఖండ్
4. సౌదాన్ సింగ్, మధ్యప్రదేశ్
5. బైజయంత్ పాండా, ఒడిషా
6. సరోజ్ పాండే, చత్తీస్‌ఘఢ్
7. రేఖా వర్మ, ఉత్తర్‌ప్రదేశ్
8. డీకే. అరుణ, తెలంగాణ
9. ఎం. చౌబా ఎవో, నాగాలాండ్
10. అబ్దుల్లా కుట్టి, కేరళ
11. లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, ఉత్తర్‌ప్రదేశ్
12. లతా ఉసేండి, చత్తీస్‌ఘఢ్
13. తారీక్ మంసూర్, ఉత్తర్‌ప్రదేశ్
జాతీయ ప్రధాన కార్యదర్శులు
1. అరుణ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్
2. కైలాశ్ విజయ్‌వర్గియా, మధ్యప్రదేశ్
3. దుశ్యంత్ కుమార్ గౌతమ్, ఢిల్లీ
4. తరుణ్ చుగ్, పంజాబ్
5. వినోద్ తావ్డే, మహారాష్ట్ర
6. సునిల్ బన్సల్, రాజస్థాన్
7. బండి సంజయ్ కుమార్, తెలంగాణ
8. రాధామోహన్ అగర్వాల్, ఉత్తర్‌ప్రదేశ్
9. బీఎస్. సంతోశ్, ఆర్గనైజేషన్ ఇంచార్జి