ఇండియా టీవీ ఒపీనియన్ పోల్.. బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లంటే..?

ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ తాజాగా విడుదలైంది. ఈ ఒపీనియన్ పోల్ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement
Update:2023-11-04 22:26 IST

ఇప్పటి వరకూ రాష్ట్రంలో సర్వే సంస్థలు బీఆర్ఎస్ కే పట్టం కట్టాయి. ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలు కూడా బీఆర్ఎస్ కే అనుకూల ఫలితాలు వస్తాయని తేల్చేశాయి. ఏబీపీ సీఓటర్ సర్వే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖామని చెప్పింది. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ కూడా బీఆర్ఎస్ విజయాన్ని ఖాయం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సాధారణ మెజార్టీకంటే 12 సీట్లు బీఆర్ఎస్ కి ఎక్కువగా వస్తాయని, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేసింది.


Full View

ఇండియా టీవీ సర్వే ఫలితాలు..

తెలంగాణలో మొత్తం సీట్లు -119

బీఆర్ఎస్ -72

కాంగ్రెస్ -33

ఎంఐఎం -07

బీజేపీ -06

ఇతరులు -01

ఇక ఓటింగ్ శాతం విషయానికొస్తే.. బీఆర్ఎస్ 44 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి 36 శాతం ఓట్లు లభిస్తాయని ఇండియా టీవీ సర్వే తెలిపింది. బీజేపీకి 11 శాతం, ఎంఐఎంకి 3 శాతం, ఇతరులకు 6శాతం ఓట్లు పడతాయని సర్వే సారాంశం. కేవలం 3 శాతం ఓట్లతో ఎంఐఎం ఏడు స్థానాలు దక్కించుకుంటుందని, 11 శాతం ఓట్లు పడినా బీజేపీ 6 స్థానాల దగ్గరే ఆగిపోతుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News