తెలంగాణ తరహాలో దేశమంతా పాలన సాగితే దేశం ఎప్పుడో 5 ట్ర‌లియ‌న్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారేది -కేటీఆర్

దేశ అభివృద్ది రేటుకన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది రేటు ఎంతో అధికంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా, కరోనా వల్ల, నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తెలంగాణా గ్రోత్ రేటు 15 శాతంగా ఉందన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-01-19 11:12 IST

తెలంగాణ తరహాలో మిగతా రాష్ట్రాలన్నీ పాలన సాగిస్తే మన దేశం ఎప్పుడో 5 ట్ర‌లియ‌న్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటున్న కేటీఆర్ ను ఇండియా టుడే న్యూస్ డైరెక్ట‌ర్‌ రాహుల్ క‌న్వ‌ల్‌ ఇంట‌ర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ, దేశ అభివృద్ది రేటుకన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది రేటు ఎంతో అధికంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా, కరోనా వల్ల, నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తెలంగాణా గ్రోత్ రేటు 15 శాతంగా ఉందన్నారు కేటీఆర్.

తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కేంద్రానికి 3 లక్షల 68 వేల కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పిన కేటీఆర్ తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం 1లక్షా 68 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ది గురించి తప్పుడు లెక్కలు చెప్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

2014 కు ముందు ఈ దేశ అప్పులు 56 లక్షల కోట్ల రూపాయలుందని, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఇప్పటి దాకా మరో 100 లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ దేశంలో అత్యధిక ద్రవ్యోల్భణం , అధిక ధరలు, నిరుద్యోగ‍ం ఇచ్చిన ఘనత మోడీ సర్కార్ దే అని కేటీఆర్ ఆరోపించారు.


Tags:    
Advertisement

Similar News